24 ఏఎం స్టూడియోస్ బ్యానరుపై శివకార్తికేయన్ రెండవ సినిమా..
- October 18, 2016
'కాక్కిసట్టై' ద్వారా యాక్షన్ హీరోగా అడుగుపెట్టడంతోపాటు, పోలీసు అధికారిగా కూడా నటించి మెప్పించారు శివకార్తికేయన్. ఆయన మళ్లీ పోలీసుగా కనిపించి మరో యాక్షన్ వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. 24 ఏఎం స్టూడియోస్ బ్యానరుపై శివకార్తికేయన్ హీరోగా నటించిన 'రెమో' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థ నిర్మాణంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా తొలిసారిగా నయనతార నటిస్తున్నారు. నవంబరు 11 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతోంది. మలేషియా, పుణే, ముంబయి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు.ఇందులో శివకార్తికేయన్ కోసం పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రను రూపొందించారట మోహన్‌రాజా. రీమేక్‌లను వదిలిపెట్టి మోహన్‌రాజా దర్శకత్వం వహించిన తొలిచిత్రం 'తని ఒరువన్' కూడా పోలీసు కథతో రూపొందినదే. ఇప్పుడు మోహన్‌రాజా, శివకార్తికేయన్లు ఇద్దరూ పోలీసు కథతోనే ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







