కేబినెట్ నిర్ణయం.. ముసాయిదా తయారీకి ఆదేశం..
- October 18, 2016
ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రెంట్ కంట్రోల్ చట్టాన్ని రూపొందించనున్నారు. ఈమేరకు మంగళవారం నాటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో 2011లో ఏపీ రెంట్ కంట్రోల్ చట్టాన్ని రూపొందించారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అద్దెలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ అవసరాలకు తీసుకొనే భవనాలకు ప్రభుత్వం చదరపు అడుగుకు గరిష్ఠంగా రూ.30 అద్దె నిర్ణయించింది. కానీ, తరలింపులో భాగంగా సాధారణ ఉద్యోగులు, సామాన్య ప్రజలు అనేక మంది ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు.ఇదే అవకాశంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని పల్లెల్లో సైతం అద్దెలు రూ.10వేలు దాటాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నేటి కాలానికి అనుగుణంగా కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 2011 నాటి ఏపీ రెంట్ కంట్రోల్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దాని స్థానంలో ఏపీ రెంట్ కంట్రోల్ చట్టం-2016ను రూపొందించనున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







