త్రిష మోడ్రన్ అమ్మవారి పాత్రలో...
- October 18, 2016
ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలలో నటించి మెప్పించిన అందాల భామ త్రిష ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ఒకప్పటి ఇమేజ్ ని అందుకోవాలని భావిస్తోంది. ఈ నేపధ్యంలో నాయకి అనే హర్రర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అభిమానులను కాస్త నిరాశపరచిన ఇప్పుడు మళ్ళీ అదే జానర్ లో మోహిని అనే సినిమాను రిలీజ్ కు రెడీ చేసింది. లండన్, థాయ్‌ల్యాండ్‌లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తైన క్రమంలో త్వరలోనే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా ఇందులో త్రిష మోడ్రన్ అమ్మవారిలా కనిపిస్తోంది. ఆర్.మధేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా త్రిష రేంజ్ కి తగ్గట్టుగానే స్టోరీని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.అయితే ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తోండగా ఇలాంటి పాత్రలో త్రిష ఎంత వరకు మెప్పిస్తోందా అని కొందరు ఆలోచలో పడ్డారు. మోహిని చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







