'గురు' శరవేగంగా చిత్రీకరణ...
- October 18, 2016
వే గం అంటే వెంకటేష్‌దే. సినిమా ప్రారంభానికి ముందే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. చిత్రీకరణ మొదలైన ఐదు వారాలకే టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. మూడు నెలల్లోనే సినిమా చిత్రీకరణని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో బరిలోకి దిగారు వెంకీ. ఆ లక్ష్యాన్ని అవలీలగా చేరుకొనేలా కనిపిస్తున్నారు. వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న 'గురు' శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీలో విజయవంతమైన 'సాలా ఖడూస్'కి రీమేక్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకటేష్ బాక్సింగ్ కోచ్‌గా కనిపిస్తారు.హిందీలో బాక్సర్‌గా నటించిన రితికాసింగ్ తెలుగులోనూ అదే పాత్రని పోషిస్తున్నారు. సెప్టెంబరు 19న 'గురు' చిత్రాన్ని ప్రారంభించారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.దీపావళిని పురస్కరించుకొని ఈ నెల 30న టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం కోసం వెంకీ తన లుక్‌ని పూర్తిగా మార్చుకొన్నారు. బరువు తగ్గడంతో పాటు కండలు పెంచి ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







