సాయికుమార్ డైరెక్షన్లో గాలి జనార్థన్‌రెడ్డి కూతురు పెళ్లి...
- October 18, 2016
మైనింగ్ ఘనుడు, రిచెస్ట్ పొలిటిషియన్ గాలి జనార్థన్‌రెడ్డి తన కూతురు మ్యారేజ్‌ను ఘనంగా ప్లాన్ చేశాడు. దాదాపు 200 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. చరిత్రలో నిలిచిపోయే విధంగా బళ్లారిలో నవంబర్ 15, 16 తేదీల్లో మ్యారేజ్ ప్రధాన వేడుక అట్టహాసంగా జరగనుంది. టోటల్‌గా చూస్తే మొత్తమ్మీద 9 రోజులపాటు నిర్వహించేలా స్కెచ్ వేసినట్టు ఆయన సహచరులు చెబుతున్నమాట. గాలి జనార్థన్‌రెడ్డి కూతురు బ్రహ్మణికి హైదరాబాద్ బేస్డ్ పారిశ్రామికవేత్త కొడుకు రాజీవ్‌రెడ్డితో పెళ్లి జరగనుంది. ఇదిలావుండగా ప్రముఖ నటుడు సాయికుమార్ డైరెక్షన్లో భారీగా పెళ్లి వేడుక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.రీసెంట్గా ఎంగేజ్మెంట్ బెంగుళూరులో జరిగింది.పెళ్లిలో ఫిల్మ్స్టార్స్తో పర్ఫార్మ్ చేయించాలని ఆలోచిస్తున్నారు గాలి సన్నిహితులు. వచ్చేందుకు ఇప్పటికే షారూక్, కత్రినా, తమన్నా, ప్రభుదేవాలు హాజరుకానున్నారట. పెళ్లికి దేశంలోవున్న ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







