ట్రాఫిక్ సేఫ్టీ ఎగ్జిబిషన్ ప్రారంభం
- October 19, 2016
మస్కట్: ఒమన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో రాయల్ ఒమన్ పోలీసులు ట్రాఫిక్ సేఫ్టీ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఇది ఐదో ఎడిషన్ ఎగ్జిబిషన్. మస్కట్ మునిసిపల్ ఛైర్మన్ మొహమ్మద్ అల్ షేక్ ఈ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ జనరల్ హస్సన్ బిన్ మొహిసిన్ అల్ షరికి (ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు కస్టమ్స్) కూడా హాజరయ్యారు. రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకోసం 2010లో సుల్తాన్ కబూస్ బిన్ సైద్ సూచనల మేరకు ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందనీ, ప్రతీయేటా ఈ ఎగ్జిబిషన్‌ని నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ సేఫ్టీ ఎగ్జిబిషన్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ కల్నల్ అలి బిన్ సలిమ్ అల్ ఫలాహి చెప్పారు. మూడు రోజులపాటు అక్టోబర్ 18 నుంచి 20 వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. 13 ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు మరియు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని ఈ సందర్భంగా అధికారులు, నిర్వాహకులు, పాల్గొన్నవారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







