'ఎల్ 7' మూవీ రివ్యూ.
- October 21, 2016
నటీనటులు: ఆదిత్, పూజ ఝవేరి, వెన్నెలకిషోర్, అజయ్
కళ: నాగసాయి
చాయాగ్రహణం: దుర్గా ప్రసాద్
సంగీతం: అరవింద్ శంకర్
నిర్మాత: ఓబుల్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముకుంద్ పాండే
నిర్మాణ సంస్థ: రాహుల్ మూవీ మేకర్స్
విడుదలః 21.10.2016
అరుణ్ ఆదిత్.. వీకెండ్ లవ్, తుంగభద్ర చిత్రాల హీరో.. తాజాగా ఎల్ 7 లో నటించాడు.. ఈ హీరోతో ముకుంద్ పాండే వెరైటీ టైటిల్ ఎల్ 7 పేరుతో మూవీ రూపొందించాడు.. హర్రర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తీసినట్లు ప్రచార చిత్రాల ద్వారా ముందే తెలిసింది.. ఈ రోజే విడుదలైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం భయపెట్టిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
కథ
ప్రపంచంలో ఏడుగురు వ్యక్తులు ఒకేలా ఉంటారు. కానీ వారిలో ఏ ఒక్కడు ఒకే ముహుర్తాన జన్మించరు. ఒకవేళ అలా జన్మించి, వారు ఒకరికొకరు ఎదురైతే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ఎల్ 7. కొత్తగా పెళ్లి అయిన జంట అరుణ్(ఆదిత్) ప్రియా(పూజ ఝవేరి). ఉద్యోగ రీత్యా వి శాఖ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ మియాపూర్ లోని ఎల్ 7 ఇంటిలో అద్దెకు దిగుతారు. కొన్ని రోజుల తర్వాత భార్య ప్రియలో మార్పు వస్తున్నట్లు గుర్తిస్తాడు అరుణ్.. ఎవో దుష్ట శక్తుల ఇంటిలో తిరుగుతున్నట్లు తెలుసకుంటాడు.. ఆ శక్తులు తన భార్యను అవహించాయని తెలుసుకని తల్లడిల్లుతాడు. ఆత్మల గురించి, వాటి ద్వారా వచ్చే సమస్యలను తొలగించే సోమనాథ్ అనే స్వామిజీ ని కలుస్తాడు అరుణ్. స్వామిజీ అరుణ్‌కి ప్రియా ఎందుకలా ప్రవర్తిస్తుందనే దానిపై, అసలేం జరిగిందో చెబుతాడు. అసలు అరుణ్‌తో స్వామిజీ ఏం చెప్పాడు? ప్రియా శరీరంలోకి దెయ్యం ఎందుకు ప్రవేశించింది? చివరకు అరుణ్ తన భార్యను ఆ శక్తుల నుంచి ఎలా రక్షించుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే..
నటినటులు
ఈ మూవీలో ఆదిత్ తన పాత్రలో ఒదిగిపోయాడు.. భార్యను కాపాడేందుకు అతను పడిన తపన నటనలో చక్కగా చూపాడు.. కొత్త హీరోయిన్ పూజ ఝవేరి దెయ్యం అవహించిన వ్యక్తిలా సెకండాఫ్‌లో పూజ నటన బావుంది. వెన్నెల కిషోర్, దీపక్ ల కామెడి ట్రాక్ ఓకే. మిగిలిన నటులు తమ తమ పరిధుల్లో నటించారు.
సాంకేతిక రంగం పని తీరు
చంద్రముఖ మూవీ నేపథ్యంతో ఈ మూవీ కథను రాసుకున్నాడు దర్శకుడు ముకుంద్ పాండే. అయితే ఇందులో ఆ ఏడుగురిలో ఓ ఇద్దరూ..ఒకే ముహుర్తాన జన్మించరు. అలా జన్మిస్తే వారిద్దరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే పాయింట్ నే హైలెట్ చేశాడు. అయితే సెకండాఫ్‌లో స్పెషల్ సాంగ్ ఎందుకో అర్ధం కాదు..దర్శకుడు ఎదో చెప్పాలనే ప్రయత్నం అయితే చేశాడు.. పూర్తి హర్రర్ చిత్రం మాత్రం కాదు. ఈ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. అరవింద్ శంకర్ సంగీతం లోని పాటలు ఈ మూవీకి మైనస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పూర్తి మార్క్ లు వేయవచ్చు. దుర్గాప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. మూవీ టేకింగ్స్ చక్కగా కుదిరాయి.. ఓసారి చూడవచ్చు.
కామెంట్ః చంద్రముఖి మిస్ అయింది.
రేటింగ్: 2/5
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







