అల్ రయాహ్ డ్రైవింగ్ స్కూల్ మార్పు
- October 21, 2016
దోహా: అల్ రయాహ్ డ్రైవింగ్ స్కూల్, ఫ్రీజ్ బిన్ ఒమ్రాన్ నుంచి మెసైమీర్‌కి రీ-లొకేట్ చేయబడింది. ఖతార్‌లో అతి పెద్ద డ్రైవింగ్ స్కూల్ ఇది. వందలాదిమంది లెర్నర్స్, పాత స్కూల్ ప్రాంగణానికి చేరుకుని, అక్కడ 'రీలొకేట్' బోర్డునీ, కోర్టు ఆర్డర్స్‌ని చూసి నిరాశ చెందారు. ల్యాండ్ లార్డ్‌తో కాంట్రాక్ట్ పూర్తవడం వల్ల స్కూల్‌ని రీ-లొకేట్ చేయాల్సి వచ్చిందని అల్ రయాహ్ డ్రైవింగ్ స్కూల్ మేనేజర్ అదిల్ సలిమ్ చెప్పారు. ఉమ్ సలాల్‌లో కొత్త ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామనీ, ఆరు నెలల్లో అది అందుబాటులోకి వస్తుందనీ, ఈలోగా మెసైమీర్‌లోని దల్లా డ్రైవింగ్ అకాడమీకి తమ స్కూల్‌ని తరలించామని ఆయన వివరించారు. ఇంకో వైపున విద్యార్థులు, సోషల్ మీడియా ద్వారా డ్రైవింగ్ స్కూల్‌ని తప్పు పడుతూ కామెంట్స్ పోస్ట్ చేశారు. తాము చెల్లించిన మొత్తాల్ని తిరిగివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే స్కూల్, విద్యార్థుల కోసం ఓ బస్ సర్వీస్‌ని మెసైమీర్ ప్రాంతానికి వెళ్ళేలా ఓ బస్‌ని ఏర్పాటు చేస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







