బస్ ఫేర్ కోసం ఆర్టిఎ స్మార్ట్ సిస్టమ్
- October 21, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, కొత్తగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి) అనే విధానం ద్వారా ప్రయాణీకులు పబ్లిక్ బస్ ట్రిప్‌లను ఎలాంటి కార్డులు లేకుండా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టిఎ ఈ విషయాన్ని 36వ జిటెక్స్ టెక్నాలజీ వీక్‌లో వెల్లడించింది. బి ఇన్ - బి ఔట్ అనే కాన్సెప్ట్‌లో ఈ కొత్త విధానం ద్వారా టికెటింగ్ జరుగుతుంది. 'బిబో'గా దీన్ని పరిగణించనున్నారు. ఈ విధానం ద్వారా ప్రయాణీకుడు బస్‌లోకి స్మార్ట్ కార్డ్, స్మార్ట్ ఫోన్‌ని తన వద్ద ఉంచుకుంటే సరిపోతుంది. కార్డ్‌ని స్వైప్ చేయడం లేదా స్మార్ట్ ఫోన్‌ని వినియోగించడం చేయనక్కర్లేదు. బిబో సిస్టమ్ ఆ స్మార్ట్ కార్డ్ లేదా స్మార్ట్ ఫోన్‌ని రీడ్ చేసి, తనంతట తానుగా ఫేర్‌ని కలెక్ట్ చేస్తుంది. ఎన్‌ఓఎల్ కార్డు ద్వారా పంచ్ చేసే విధానానికి ఈ బిబో సిస్టమ్ ద్వారా చెక్ పెట్టవచ్చు. తద్వారా క్లియర్‌గా ఫేర్ కలెక్షన్ జరగడంతోపాటుగా సమయం కూడా వృధా అవకుండా ఉంటుంది. స్మార్ట్ దుబాయ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ స్మార్ట్ బిబో సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







