షార్జా వ్యాపార మండలి అధ్యక్షురాలతో పాటు మరో ఇద్దరు అగ్ని ప్రమాదంలో మృతి
- October 23, 2016
షార్జా వ్యాపార మహిళా మండలి (SBWC) అధ్యక్షరాలు ఆమె కుటుంబ సభ్యులు ఇరువురు వారి ఇంటిలో జరిగిన విషాద అగ్నిప్రమాదంలో వారాంతంలో మరణించారు. షార్జా వ్యాపార మహిళా మండలి అధ్యక్షరాలు అమీరా బిన్ కరమ్ చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించాయి, శనివారం క్యాడిసియాహ్ లోని ఆమె ఇంటిలో అగ్నికీలలు వ్యాపించి ఆమె తీవ్ర గాయాలతో చనిపోయింది. ఆమెతో పాటు తన 40 ఏళ్ల సోదరి సామా బిన్ కరమ్, మరియు 57 ఏళ్ల తల్లి విపరీతమైన పొగ కారణంగా ఊపిరాడక మరణించారు.
శనివారం సాయంత్రం 4.30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అమీరా బిన్ కరమ్ సోదరుడు ఖలీద్ తీవ్రంగా గాయపడటంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అమీరా బిన్ కరమ్ తండ్రి ఇంట్లో లేకపోవడంతో ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగేరు.ఇంటి ముందు భాగం నుండి మొదలై అనంతరం మేడమీద విల్లా గదులు అంతా వ్యాపించి ఆ కుటుంబం మొత్తం మంటలలో చిక్కుకొనిపోయేలా మంటలు వారిని చుట్టిముట్టేయని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అమీరా బిన్ కరమ్ భౌతికకాయాన్ని చూసేందుకు హైనెస్ షెఇఖ జవహేర్ బిన్తె ముహమ్మద్ అల్ ఖ్అసిమి శ్రీశ్రీ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖ్అసిమి షార్జా ఆఫ్ హయ్యర్ సుప్రీం కౌన్సిల్ మరియు రూలర్ సభ్యుడు భార్యతో హాజరై అమీరా మరణానికి తీవ్ర సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







