మెగాస్టార్ కి 60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు ..

- August 21, 2015 , by Maagulf
మెగాస్టార్ కి 60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు ..

తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు అఖిలంద్ర ప్రజానికానికి ఆగస్టు 22వ తేదీ గురించి ప్రత్యేకంగా చేయనక్కర్లేదు. ఎందుకంటే టాలీవుడ్ సుప్రీం హీరో & మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆ రోజు. 60వ ఏటా అడుగుపెట్టిన మన చిరుకి ముందుగా తెలుగు మిర్చి తరుపున విషెస్ తెలుపుతున్నాం. రాజకీయ ప్రవేశం తర్వాత ఇండస్ట్రీకి కొంత దూరమైన చిరంజీవి మళ్లీ పూర్తిగా ఇండస్ట్రీతో కలిసి ప్రయాణించడానికి సిద్ధమయ్యాడు. దాంతో చిరు 60వ బర్త్‌డే వేడుకను చాల గ్రాండ్ గా జరిపారు. చిరు అభిమానులు రక్త దాన శిబిరాలు, సేవా కార్యక్రమాలతో పాటు పలు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో మెగా హీరోలందరూ పాల్గొని చిరు పుట్టిన రోజును ఎంజాయ్ చేసారు. ఆగస్టు 22న పార్క్ హయత్ హోటల్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల కోసం పెద్ద ఎత్తున బర్త్‌డే పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ పార్టీకి సూపర్ స్టార్లు బిగ్ బి, రజనీకాంత్, ఆమీర్ ఖాన్, సల్మాన్‌ఖాన్‌, పాటు పలువురు సినీ స్టార్లు కూడా హాజరుకానున్నట్టు తెలిసింది. చిరు బర్త్‌డే కానుకగా అతిథుల కోసం ఓ స్టన్నింగ్ గిఫ్ట్‌ను రామ్‌చరణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఎంతో కాలంగా చిరు 150 వ చిత్రం ఫై ఓ క్లారిటి వస్తుందని అబిమానులు అనుకున్న వారికి నిరాశే మిగిలింది..అయిన కానీ మరో నెలలో ఈ చిత్రం ఫై ఓ అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఏది ఏమయినా చిరు మళ్లీ సినిమాల్లోకి రావడం తో అబిమనులే కాదు , ఇండస్ట్రీ లోని హీరోలు కూడా సంతోషిస్తున్నారు. ఇంకో మెగా అబిమానులకు గుడ్ న్యూస్ ఏంటి అంటే..చిరు పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ - శ్రీను వైట్ల మూవీ ఫస్ట్ లుక్ టిసర్ రిలీజ్ చేసారు..ఆ వీడియో మీకోసం. 

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com