చిరు బర్త్ డే పార్టీకి బాలీవుడ్ తారలు
- August 21, 2015
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు బాలీవుడ్ అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ హాజరుకానున్నారు. చిరంజీవి 60 జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తనయుడు హీరో రామ్ చరణ్ ఈనెల 22న స్టార్ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి అమితాబ్, ఆమిర్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. అమితాబ్, ఆమిర్ లను ఇప్పటికే ఆహ్వానించారని... వారిద్దరూ రావడం ఖాయమని రామ్ చరణ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అమితాబ్ ను రామ్ చరణ్ వ్యక్తిగతంగా ఆహ్వానించారని తెలిపాయి. శనివారం సాయంత్రం జరగనున్న చిరంజీవి జన్మదిన వేడుకల కోసం ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెంకటేష్, నాగార్జున, జగపతిబాబుతో సహా తెలుగు సినిమా ప్రముఖులు బర్త్ డే పార్టీకి రానున్నారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య పుట్టినరోజు వేడుకలకు హాజరవుతారని సమాచారం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







