బహ్రెయిన్ హజ్ యాత్రీకులు నిబంధనలు పాటించాలి
- August 22, 2015
బహ్రెయిన్ నుండి మక్కా కు హజ్ యాత్ర నిమిత్తమై వచ్చే నెల వెళ్లనున్న సుమారు 3500 మంది యాత్రీకులు, పెరిగిన భద్రతా నియమావళి ప్రకారం నడుచుకోవాలని, రాజకీయ సంబంధమైన సాహిత్యాన్ని కలిగిఉండడo లేదా మతవిధానాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం వంటి చర్యలు శిక్షార్హమైనవని, ఆంతరంగిక శాఖ పోర్టు సెక్యూరిటీ డైరక్టర్ జనరల్- కల్నల్ మహెర్ అహ్మద్ బువాలీ హెచ్చరించారు. ఇంకా బస్సు డ్రైవర్లు యాత్రీకుల భద్రత కోసం, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అసిస్టెంట్ డ్రైవర్లను కలిగిఉండాలని హెచ్చరించారు. హజ్ మెడికల్ మిషన్ కో-ఆర్దీనేషన్ ఛైర్మన్ డా. అలీ అల్ బక్కారా మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న 51 రిజిష్టర్డ్ మక్కా కరవాన్లు ఐనా నియమనింబంధనలు పాటించి వెక్సినేషన్లు చేయించుకోవాలని, యజమానులు మేనేజర్లకు విజ్ఞప్తి చేశారు. అధికారులకు చెప్పాపేట్టకుండా యాత్రకు వెళ్ళిపోయే భక్తులు తమకు పెద్ద సవాలని కూడా ఆయన తెలియజేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







