'ఎస్ 3' చిత్రం టీజర్ దీపావళికి విడుదల...
- October 25, 2016
హరి దర్శకత్వంలో సూర్య, అనుష్క, శ్రుతిహాసన్ తదితరులు నటించిన చిత్రం 'ఎస్ 3'. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆరంభమైన ఈ చిత్ర షూటింగ్ సుమారు పది నెలలు జరిగి పూర్తి చేసుకుంది. చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో షూటింగ్ జరిగింది. హరి దర్శకత్వంలో సూర్య నటించిన 'సింగం' చిత్రం మొదటి భాగం 2010లో సూపర్ హిట్ కొట్టింది. దీంతో ఈ చిత్రానికి రెండో భాగంగా 2013లో 'సింగం - 2'ను విడుదల చేశారు. ఈ రెండు భాగాలు వ్యాపారపరంగా భారీ వసూళ్లను రాబట్టాయి. దీంతో మూడో భాగాన్ని విడుదల చేయడానికి హరి నిర్ణయించారు.
దీనికి 'సింగం' కాకుండా 'ఎస్ 3'గా పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల సూర్య నటించిన చిత్రాలు పెద్దగా హిట్‌టాక్ తెచ్చుకోకపోవడంతో ఆయన 'ఎస్ 3' పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్ర షూటింగ్ దశలోనే వ్యాపారం ముగిసినట్లు సమాచారం.
తొలి రెండు భాగాల్లోనూ నటించిన అనుష్క, మూడో భాగంలో కూడా సూర్యతో జోడీ కడుతున్నారు. చిత్రంలో మరో హీరోయిన్గా శ్రుతిహాసన్ నటించారు. హారిస్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం టీజర్ దీపావళికి విడుదల చేస్తారని భావిస్తున్నారు. డిసెంబర్ 16న 'ఎస్ 3' విడుదల కానుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







