నవ్యాంధ్రప్రదేశ్ లో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ...
- October 25, 2016
హైదరాబాద్‌లో ఉన్న సినీ పరిశ్రమ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలిరావాలని నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షురాలు, సినీనటి కవిత పేర్కొన్నారు. బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లో సోకాల్డ్ నిర్మాతలు సీనియర్ నటి నటులకు అవకాశం కల్పించకుండా పక్క రాష్ట్రాల నుంచి నటీ నటులతో చిత్రాలు నిర్మిస్తున్నారని విమర్శించారు. వైజాక్ ప్రాంతంలో స్టూడియోలు నిర్మిస్తామని స్థలాల కోసం వెతుకుతున్నారన్నారు. వారు సినీ పరిశ్రమను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారని, అటువంటి వారికి ప్రభుత్వం స్థలాలు ఇవ్వరాదని సూచించారు.సినీ పరిశ్రమ అమరావతిలో ఉంటే స్థానిక, సీనియర్ నటులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవన్నారు. నూతనంగా నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు పేరుతో సం స్థను ప్రారంభించినట్లు తెలిపారు. సమావేశంలో అధ్యక్షుడు ఎస్‌వీఎన్ రావు, కార్యదర్శి సాయిప్రసాద్, కోశాధికారి ఎస్‌వీ తిరుమలరావు, సభ్యులు విజయ భాస్కర్‌రెడ్డి, తోట కృష్ణ, కె.శ్రీనాథ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







