వారణాసిలో బాణాసంచా వల్ల పేలుడు, ఐదుగురి మృతి
- October 26, 2016
అక్రమంగా నిల్వ చేసిన బాణాసంచా వల్ల పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన వారణాసిలో చోటుచేసుకుంది. పీతర్కుండ్ ట్రైసెక్షన్ సమీపంలోని ఓ రెండంతస్తుల భవనంలో మంగళవారం అర్థరాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల కారణంగానే ఈ పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారి నితిన్ తివారీ తెలిపారు. మృతుల్లో ఇద్దరు వ్యక్తులను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







