కిక్ 2 రివ్యూ
- August 23, 2015
కథలోకి వెళ్తే 2009 లో వచ్చిన కిక్ సినిమాకి సీక్వల్ గానే ఈ కిక్ 2 కూడా మొదలౌతుంది. కిక్ పార్ట్ 1 లో చివరాకరన పోలీస్ ఆఫీసర్ అయిపోయిన కిక్ తర్వాత ఫారిన్ లో సెటిల్ అయిపోతాడు. అక్కడే రాబిన్ హుడ్ అనే కొడుకుని కుడా కంటారు.కానీ తండ్రిలాగే రాబిన్ కి కుడా కొంచం తలతిక్క. తండ్రి కిక్ కోసం పాకులాడితే కొడుకు కంఫర్ట్ అనే పిచ్చి తో ఇతరులకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు.ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో ఉన్న తన ఆస్తిని ఎవరో కబ్జా చేసారు అని తెలుసుకుని ఆస్తిని తిరిగి దక్కించుకోవాలని ఇండియా వస్తాడు. అక్కడే తనకు చైత్ర అనే అమ్మాయి పరిచయం అయ్యి తనను ప్రేమలో దింపడానికి ప్రయత్నిస్తుంది. తీరా రాబిన్ కుడా ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టే సమయానికి... కావాలని చైత్ర కిడ్నాప్ అయినట్లు నటించి బీహార్ లో ఉన్న తన గ్రామానికి వెళ్ళిపోతుంది. ఈ హటాత్ పరిణామానికి నివ్వెరపోయిన రాబిన్ తనను వెతుక్కుంటూ బీహార్ కి వెళ్తాడు.అసలు చైత్ర ఎందుకు అలా నటించింది, బిహార్ వెళ్ళిన రాబిన్ కి తెలిసిన అసలు నిజం ఏంటి అనేది మిగిలిన కథ. విశ్లేషణ: ఒక సినిమా హిట్ కావాలన్నా, బాగుంది అని పేరు రావాలన్న, మంచి సినిమా అని ప్రేక్షకులు మేచ్చుకోవలన్నా..ఆ సినిమా ప్రేక్షకుడి హృదయానికి కనెక్ట్ అవ్వాలి. ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వాలంటే సన్నివేశాల్లో జీవం ఉండాలి. సన్నివేశాల్లో జీవం ఉండాలంటే కథలో దమ్ము ఉండాలి. దమ్ము ఉండాలంటే ఆ కథ సహజత్వానికి దగ్గర గా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎంత పెద్ద స్టార్లు ఉన్నా.. ఎంత పెద్ద దర్శకుడు అయినా బోలెడు ఖర్చు పెట్టినా ఆయాసం అవమానం తప్ప దమ్మిడీ ఆదాయం కుడా ఉండదు. ఇదే సూత్రం ఇప్పుడు కిక్ 2 చిత్రానికి కూడా వర్తిస్తుంది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. బహుశా రవితేజాకి గాని దర్శకుడు సురేందర్ రెడ్డికి గాని ఇలాంటి ఫ్లాప్ ఇంతవరకు రాలేదనే చెప్పాలి. సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఇదేం సినిమారోయ్ బాబోయ్ అని ఒకడంటే ఈ సురేందర్ రెడ్డికి ఏమైందిరా నాయనా అని మరోకడనడం ఇక్కడ విశేషం. ప్రేక్షకులు ఇలా ఫీలవడానికి కారణం ఈ సినిమాలో సీరియస్ విషయాలను చాలా కామెడీగా... సిల్లీ విషయాలను చాలా సీరియస్ గా చెప్పడమే. అసలు కంటిన్యుటి చూసుకోకుండా ఒక పాత్ర దారితో రెండు మూడు క్యారెక్టర్లు వేయించిన ఘనత దర్శకుడు సురేందర్ రెడ్డికే దక్కుతుంది. అంతే కాకుండా చిన్న బడ్డీ కొట్టు కూడా లేకుండా నాలుగు ఇళ్ళు కూడా లేని ఓ కుగ్రామంలో కె.ఎఫ్.సి చికెన్లు, విదేశీ బ్రాండ్ వస్తువులు లభించేలా దర్శకుడు తీసిన సన్నివేశాలు నభూతో న భవిష్యత్తు. అసలు సినిమాలో హీరోతో సహా ఏ పాత్రనీ సరిగ్గా డిజైన్ చేయలేదు. ఏ సన్నివేశంలో జీవం లేదు. ఒట్టి నస, తలకాయనొప్పి తప్ప.. కథ, కథనం, పాత్రలకు గమ్యం, ఇవేమీ లేని ఈ సినిమాని కాస్త ఆసక్తిగా మొదలెట్టినా ఆ తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందీ అని ప్రేక్షకుడు ఎదురు చూడడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక నటీనటుల విషయానికి వస్తే ఎప్పటిలానే రవితేజ ఎనర్జిటిక్ చేసినా తన రూపంతో కాస్త భయపెట్టాడనే చెప్పచ్చు. బక్క చిక్కిపోయి మొహం పీక్కుపోయి ఏ మాత్రం కళ లేని రవితేజ ఆహార్యం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన అందంతో అలానే తన నటనతో మరొక్కసారి మెప్పించింది. సినిమాలో ఏదన్న కాస్త రిలీఫ్ అంటే అది రకుల్ మాత్రమే. ఇక బ్రహ్మానందం రవితేజ కామెడి కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు తప్ప మిగిలినదంతా రొటీన్. ఇక టెక్నికల్ అంశాల్లోకి వస్తే ఎస్.ఎస్.తమన్ సంగీతం యాజిటీస్. కొత్తగా ఏమిలేదు. అలాగే కథతో పాటు వక్కంతం వంశి అందించిన మాటలు పేలకపోగా తుస్సుమన్నాయి. కానీ సినిమాటోగ్రఫీ మాత్రం చాల బాగుంది. అలాగే కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలు మాత్రం అధ్బుతం. ఏమాత్రం ఖర్చుకి వెనుకాడకుండా చాల క్వాలిటీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ పేలవమైన కథా కథనాలతో క్వాలిటీ అంతా గంగలో కలిసిపోయింది. పాపం కళ్యాణ్ రామ్. మైనస్ పాయింట్స్ : దర్శకత్వం, కథ, కథనం, మాటలు, రవితేజ ఆహార్యం ప్లస్ పాయింట్స్ : రకుల్ ప్రీత్ సింగ్, సినిమాటో గ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నఈ చిత్రానికి మాగాల్ఫ్.కామ్ వారి రేటింగ్ 2/5.
ఈ చిత్రానికి మాగాల్ఫ్.కామ్ వారి రేటింగ్ 2.5/5
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









