సాత్ వడి
- August 23, 2015
కావలిసిన పదార్ధాలు
బొంబాయి రవ్వ - ఒక కప్పు
శెనగపిండి - ఒక కప్పు
నెయ్యి - రెండు కప్పులు
పాల పొడి - ఒక కప్పు
కొబ్బరి తురుము - ఒక కప్పు
ఎండుద్రాక్ష, బాదం, పిస్తా, జీడిపప్పు - రెండు స్పూన్లు
యాలకుల పొడి - సరిపడినంత
పాలు - రెండు కప్పులు
పంచదార - ఒక కప్పు
తయారీ విధానం
బొంబాయి రవ్వను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. నెయ్యి కరిగించి పెట్టుకోవాలి. పంచదార కొద్దిగా పాకం పట్టి ఉంచాలి. ఒక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి దానిలో శెనగపిండి వేసి వేయించి, తరువాత కొబ్బరి తురుము కూడా వేసి కొద్దిగా వేయించి, దానిలో వేయించిన బొంబాయి రవ్వ, పాలపొడి, కరిగించి పెట్టుకున్న పంచదార పాకం వేసి బాగా కలపాలి. తరువాత పాలు కూడా పోసి మిశ్రమం మొత్తం దగ్గరకు అయ్యేవరకూ ఉంచాలి. దగ్గరకు అయ్యిన మిశ్రమం పాత్ర నుంచి విడిపోతున్నట్టు అన్పిస్తున్నప్పుడు దానిలో డ్రైప్రూట్స్ అన్నీ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన ప్లేటులోనికి తీసుకుని, ఆరాక చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







