ఆంధ్ర,తెలంగాణా ముఖ్యమంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు
- August 23, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు ఆధునాతన బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉపయోగించనున్నారు. తొలుత కెసిఆర్ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొన్నది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు కోసం రూ.5 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ బస్సు వచ్చింది. దీనిని చంద్రబాబు జిల్లాల పర్యటనలకు ఉపయోగించనున్నారు. కెసిఆర్, చంద్రబాబుల బుల్లెట్ ప్రూఫ్ బస్సుల పైన విమర్శలు కూడా వచ్చాయి. నిధులు లేవంటూ బస్సుల కోసం ఇంత ఖర్చు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోసం అన్నిహంగులతో కూడిన అత్యధునాతన బస్సు గత జూలై మొదటి వారంలో హైదరాబాదుకు చేరుకుంది. దానికి పూజలు కూడా జరిగాయి. చండీగఢ్‌లో రూపొందించిన ఈ బస్సు పూజలు జరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు చేరుకుంది. అక్కడ పూజలు చేశారు. అత్యధునాతన హంగులతో చంద్రబాబు కోసం కూడా చండీగఢ్‌లో బస్సు తయారయి, ఇటీవలే విజయవాడకు వచ్చింది. రాష్ట్రంలోని జిల్లాల పర్యటనకు, అతిథిగృహంతో సంబంధం లేకుండా వాహనంలోనే బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను బస్సులో చేశారు. భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండే విధంగా అద్దాలతో సహా అంతా బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించే విధంగా దాన్ని రూపొందించారు. టైర్లను తూటాలతో పేల్చినా కూడా 30 - 50 కిలోమీటర్ల వరకు బస్సు సాఫీగా ప్రయాణిస్తుంది. జెసిబీఎల్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్‌తో కలిసి ఈ బస్సును తయారు చేసింది. ఈ బస్సులో కార్యాలయం ఏర్పాటు కూడా ఉంటుంది. ఆరుగురు ఏడుగురు కూర్చునే విధంగా సీటింగ్ ఆరేంజ్‌మెంట్ ఉంటుంది. దాని వెనక సిఎం కోసం ప్రత్యేక గది ఉంటుంది. 15, 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకునేందుకు రివాల్వింగ్ చైర్, రాత్రి వేళ నిద్రపోవడానికి పరువు ఉంటాయి. బస్సు వెనక భాగంలో స్నానాల గది ఉంటుంది. టీవీ, ఫ్యాక్స్, ఇంటర్నెట్, వైఫై, ప్రింటర్ సదుపాయాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన బస్సు వచ్చింది. రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన బస్సును సిఎం చంద్రబాబు శుక్రవారం నాడు పరిశీలించారు. దీనిని జిల్లా పర్యటనల్లో ఉపయోగిస్తారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







