బియ్యం నీళ్లతో చుండ్రు నుంచి ఉపశమనం
- August 23, 2015
బియ్యం కడిగిన నీళ్లతో అందాన్ని మరింత అందం చేసుకోవచ్చు. చిక్కగా ఉన్న బియ్యం నీళ్లలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. ఆ దూది ఉండలతో ముఖం తుడుచుకుంటే కాలుష్యంతో ముఖానికి పట్టిన మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా మెరుస్తుంది. చర్మం మీద అప్పుడప్పుడూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు బాధపెడుతూ ఉంటాయి. వాటిని ఈ బియ్యం నీళ్లతో తొలగించుకోవచ్చు. అన్నం వార్చిన నీళ్లలో(గంజి), బియ్యం కడిగిన నీళ్లు కొన్ని కలిపి, దానికి కొద్దిగా పసుపు చేర్చి పేస్ట్‌లా చేసి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచి ఆ మిశ్రమాన్ని మరుసటిరోజు ఉదయం తలకు పట్టించి, ఇరవై నిముషాల తరువాత తలస్నానం చేస్తే తలలోని చుండ్రు, తద్వారా వచ్చే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. అనేక చర్మ సమస్యలకు ఈ బియ్యం గంజి నీళ్లు మంచి మందుగా పని చేస్తాయి.ఈ గంజి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మ సమస్యలనూ, దురదలనూ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే త్వరగా ఉపశమనం పొందవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







