మైక్రోసాఫ్ట్ 'సర్ఫేస్ స్టూడియో'ను ఆవిష్కరించింది ...
- October 28, 2016
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు వచ్చాక డెస్క్‌టాప్ కంప్యూటర్ల వాడకం తగ్గుముఖం పట్టింది. కార్యాలయాల్లో, ఇళ్లల్లోనూ డెస్క్‌టాప్‌ల స్థానాన్ని ల్యాపీలు ఆక్రమించేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం దిగ్గజ సంస్థలన్నీ నాజూకైన ల్యాప్‌టాప్‌లను, ట్యాబ్లెట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు పోటీపడుతున్నాయి. కానీ.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మాత్రం అందుకు భ్నిన్నంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లపై దృష్టి పెట్టింది. తన నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో తొలి డెస్క్‌టాప్ పీసీని ఆవిష్కరించింది. ఆకట్టుకునే డిజైన్.. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉన్న ఈ కంప్యూటర్ పేరు 'సర్ఫేస్ స్టూడియో'.ఇన్నాళ్లూ హైఎండ్ డెస్క్‌టాప్ కంప్యూటర్లు అంటే ఆపిల్ 'ఐమ్యాక్' పీసీలే గుర్తొచ్చేవి. వాటిని కొనాలంటే సామాన్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఇప్పుడు ఐమ్యాక్‌లకు ధీటుగా 'సర్ఫేస్ స్టూడియో'ను ఆవిష్కరించింది మైక్రోసాఫ్ట్. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు.. వీడియో ఎడిటర్లకు బాగా సూటయ్యే ఈ క్రేజీ డెస్క్‌టాప్ ప్రారంభ ధర ఎంతో తెలుసా? అక్షరాలా మూడు వేల డాలర్లు!(మన కరెన్సీలో రూ.2లక్షలకు పైనే)ధరే కాదు.. ఇందులోని ఫీచర్లూ అదే రేంజ్‌లో ఉన్నాయి. అవేంటంటే..
* 28 అంగుళాల ఆల్ట్రా-హెచ్‌డీ 4.5కే టచ్ స్క్రీన్
* ప్రపంచంలోనే అత్యంత పలుచని స్క్రీన్
* 32 జీబీ ర్యామ్
* 1టీబీ లేదా 2టీబీ హార్డ్ డిస్క్
* ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెస్సర్
* హార్డ్‌కోర్ ఎన్-వీడియా జీటీఎక్స్ 980యం గ్రాఫిక్స్ కార్డ్
* వైఫై, బ్లూటూత్
* కెమెరా: ముందు 5 మెగా పిక్సెల్స్.. వెనుక 1080పిక్సెల్స్
* ట్యాబ్లెట్ మోడ్‌లోకి మార్చేయొచ్చు
* 3డీ వీడియోలను, ఫొటోలను తయారు చేసుకోవచ్చు
ఈ డెస్క్‌టాప్ కంప్యూర్ల కోసం ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ప్రీ- ఆర్డర్లను స్వీకరిస్తోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







