ఫ్యామిలీ క్లబ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసు కోవాలి...
- October 29, 2016
రాష్ట్రంలో ఫ్యామిలీ క్లబ్‌లను ప్రభుత్వం మూసివేయడం వల్ల వేలాదిమంది కార్మికులు వీధినప డ్డారని తెలంగాణ ఫ్యామిలీ క్లబ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జె.పరమేశ్‌గౌడ్ తెలిపారు. ఫ్యామిలీ క్లబ్‌లలో పనిచేసిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉ పాధి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర మేశ్గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ క్లబ్‌లను మూసేసిందని చెప్పా రు. దీంతో ఇందులో పనిచేస్తున్న 10 వేల మంది కార్మికు లు వీధినపడ్డారని ఆయన ఆరోపించారు. ఫ్యామిలీ క్లబ్‌ల ను మూసివేసిన ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్న సొసైటీ క్లబ్‌లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.సొసైటీ క్లబ్‌లు ప్రజాప్రతినిధుల అండదండలతో నడుస్తుండడం వల్లే ప్రభుత్వం వాటి జోలికి వెళ్లడం లేదని, ప్లేబాయ్ క్లబ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఫ్యామిలీ క్లబ్‌లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఉన్నత చదువులు చదివిన వారే ఫ్యామిలీ క్లబ్‌లలో కార్మికులుగా పనిచేస్తున్నారని, క్లబ్‌లను మూసి వేయడం వల్ల ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ క్లబ్‌లకు విధించిన రూల్స్ గైడ్ లైన్స్ మార్గదర్శకాలను ఫ్యామిలీ క్లబ్‌లకు కూడా వర్తింప జేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం ఫ్యామిలీ క్లబ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసు కోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







