వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు హతం
- October 30, 2016
ఆఫ్ఘనిస్థాన్ దంగామ్ జిల్లాలోని కునార్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సంకీర్ణ సేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడుల్లో 19 మంది లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. 8 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ హోంశాఖ అధికారికంగా నిర్ధారించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపిన నేపధ్యంలో ఆఫ్ఘన్ బలగాలు స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సేనలు విరుచుకుపడటం ఇదే ప్రథమం. ఒకప్పుడు భారత్‌ను మాత్రమే అస్థిరం చేయాలనుకుంటూ తయారుచేసిన లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ పైన కూడా ఉసిగొల్పుతోంది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. అందుకే ఈ రెండు దేశాలను కూడా పాకిస్థాన్ ఏకకాలంలో టార్గెట్ చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో సైన్యానికి అమెరికాతో పాటు భారత్ కూడా శిక్షణనిస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







