దీపావళి వేడుక - జర్నీ ఆఫ్ ఇండియన్ బ్రైడ్
- October 30, 2016
జర్నీ ఆఫ్ ఇండియన్ బ్రైడ్ అనే థీమ్ మేరకు భారతదేశానికి చెందిన తొమ్మిది మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేవారు. దీపావళి సందర్బంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొమ్మిది మంది మహిళలు సంప్రదాయ చీరకట్టులోనూ, భారీగా ఆభరణాలతోనూ, జాస్మిన్ ప్లవర్స్తోనూ కనిపించి కనువిందు చేశారు. ఒవిలియా ఈ కాన్సెప్ట్‌ని డిజైన్ చేసింది. ప్రీతి, నసీమా, పూనమ్, భాగ్యశ్రీ, సిల్వియా, షోలా, సిస్మి మరియు అంజలి మోడల్స్‌గా ఈ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది. దీపావళి సందర్భంగా ఈ కొత్త కాన్సెప్ట్ అందర్నీ అలరించింది. దుబాయ్‌లోని పెష్వ రెస్టారెంట్ ఈ ఈవెంట్‌కి వేదికయ్యింది. ఈ సందర్భంగా సచిన్ నర్హార్ జోషి, శ్రియా జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభినంద్ అభి ఫొటోగ్రఫీ, రాధికా శర్మ అండ్ టీమ్ మేకప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.




తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







