ఒబామా తొలిసారి తన అధికారిక కార్యాలయంలో దీపావళి వేడుకలు
- October 30, 2016
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారి తన అధికారిక కార్యాలయంలో దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. తన తర్వాత వచ్చిన అధ్యక్షులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ '2009లో నేను , మిచెల్ దీపావళీ జరుపుకొన్నప్పుడు భారతీయులు సంతోషించారు. మేము ముంబయి వెళ్లినప్పుడు మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వనించారు. ఆ అనుభవాన్ని మర్చిపోలేను. దీపావళి సందర్భంగా ఈ సారి నా కార్యాలయంలో మొట్టమొదటి దీపం వెలిగించిన అనుభవం మర్చిపోలేను. దీనిని చూస్తే చీకటి తర్వాత వెలుగు వస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులు కూడా పాటిస్తారని భావిస్తున్నాను.మీరు, మీకు ఇష్టమైనవారు ఈ దీపావళికి సుఖసంతోషాలతో ఉండాలని ఒబామా కుటుంబం తరపున కోరుకుంటున్నాను' అని ఒబామా అన్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసిన వెంటనే 1.5లక్షల లైకులు, 33,000 షేర్లు వచ్చాయి.క్లింటన్ శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా హిందు, సిక్కు, జైన్, బౌద్ధులకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లింటన్ మాట్లాడుతూ.. 'ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల మంది హిందు, సిక్కు, బౌద్ధ, జైనులు, రెండు కోట్ల మంది అమెరికన్లు ఈ దీపావళిని ఘనంగా జరుపుకొంటారు. దీపం చెడుపై విజయానికి చిహ్నంగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







