నల్గురు ప్రవాసీయులకు 10 ఏళ్ళ జైలుశిక్ష,దేశ బహిష్కరణ
- October 31, 2016
దోపిడీకి పాల్పడిన నల్గురు ప్రవాసీయులకు పదేళ్ల జైలుశిక్ష ఆ తర్వాత దేశ బహిష్కరణను విధిస్తూ,దోహా నేర న్యాయస్థానం ఆదేశించింది. ఈ సమాచారంను ఆదివారం కోర్టు అధికార వర్గాలు నివేదించారు.ఒక స్థానిక నగదు మార్పిడి కంపెనీ ఉద్యోగి వాహనం నుండి1.5 మిలియన్ క్యూ ఆర్ లను ఈ నలుగురు ముద్దాయిలు దొంగిలించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.ఛార్జ్ షీట్ లోని వివరాల ప్రకారం, దోషులు ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో బాధితుడు ప్రయాణిస్తున్న వాహనంకు ఎదురుగా వచ్చి వారి వాహనంతో " ఢీ " కొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఆ సమయంలో ఆ నల్గురు నిందితులు ఉద్యోగి వద్ద నుంచి డబ్బుతో నిండుగా ఉన్ననగదుసంచిని పట్టుకుని పారిపోయారు.పోలీసులు జరిపిన పరిశోధనలో ఈ నల్గురు ముద్దాయిలు దొంగిలించిన ఒక నంబర్ ప్లేట్ కారుని ఈ దోపిడీకి వినియోగించినట్లు వెల్లడించారు. దోపిడీ అనంతరం వారు ఉపయోగించిన కారుని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. చోరీ చేసిన డబ్బుతో ఒకొక్కరు అనుమానం రాకుండా దేశం విడిచి పారిపోయేందుకు ఆ నల్గురు పధక రచన చేశారు. విషయం సద్దుమణిగి పోయిందనుకొని కొన్ని రోజుల తర్వాత విమానాశ్రయం నుంచి పారిపోయే మొదటి వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన ముగ్గురు సహచరుల ఆచూకీ గురించి పోలీసులకు వివరించి సహకరించిన మొదటి వ్యక్తి తాము చేసిన దోపిడీని అంగీకరించాడు. వారు చివరికి వారి నేరాన్ని అంగీకరించాడు,వారు దొంగిలించిన డబ్బులో వారు కొంత ఖర్చు చేయగా మిగిలిన నగదుని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







