ఫిబ్రవరి 9న 'ఓం నమో వేంకటేశాయ'

- October 31, 2016 , by Maagulf
ఫిబ్రవరి 9న 'ఓం నమో వేంకటేశాయ'

అక్కినేని నాగార్జున..కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామి ప్రియ భక్తుడైన హాథిరామ్ బాబాగా కనిపించనున్నాడు నాగార్జున. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో చేయాల్సి ఉంది. ఈ పనులన్నింటినీ జనవరి నాటికి ముగించి చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com