రియాద్‌లో అవిభక్త కవలలకు సర్జరీ
- October 31, 2016
రియాద్: సుడాన్‌కి చెందిన అవిభక్త కవలలు రియాద్‌లోని ఓ హాస్పిటల్‌లో విజయవంతంగా సర్జరీ ద్వారా విడదీయబడ్డారు. 11 గంటలపాటు ఈ సర్జరీ జరిగింది. ముందుగా 15 గంటలపాటు సర్జరీ జరుగుతుందని డాక్టర్లు అంచనా వేసినా, నాలుగు గంటల ముందే సర్జరీ ప్రక్రియ ముగిసింది. డాక్టర్ అబ్దుల్లా అల్ రబీయా ఈ సర్జికల్ టీమ్‌కి చీఫ్‌గా వ్యవహరించారు. 28 మంది వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ సర్జరీలో పాల్గొన్నారు. అనస్తీషియా, పెడియాట్రిక్ సర్జరీ, పెడియాట్రిక్ యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పెడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జరీతోపాటు కింగ్ అబ్దుల్లా స్పెషాలిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్, కింగ్ అబ్దు అజిజ్ మెడికల్ సిటీ, మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ గార్డ్ హెల్త్ అఫైర్స్ నుంచి నర్సింగ్ సహా పలు విభాగాలు ఈ సర్జరీకి సహకరించడం విశేషం. అబ్డామిన్ మరియు పెల్విస్ విభాగాల్లో ఈ అవిభక్త కవలలు అతుక్కుని ఉన్నారు. కవలల తండ్రి హరౌన్ ఇషాక్ మాట్లాడుతూ, చాలా ఉత్కంఠగా సర్జరీ ప్రక్రియ జరిగినంతసేపూ ఉన్నామనీ, ఆ ఉత్కంఠకు తెరపడి తాము ఇప్పుడు ఆనందంగా ఉన్నామని అన్నారు. సౌదీ టీమ్ ఇలా అవిభక్త కవలలకు సర్జరీ చేయడం ఇది 40వ సారి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







