బిజినెస్ ర్యాంకింగ్‌లో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో నిలిచాయి.
- October 31, 2016
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో నిలిచాయి. సోమవారం కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. ర్యాంకుల్లో 98.78 మార్కులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే 3వ స్థానంలో గుజరాత్, 4వ స్థానంలో చత్తీసగఢ్, 5వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. 2016 సంవత్సరానికి గానూ ఆయా రాష్ట్రాలు వాణిజ్య, వ్యాపార రంగాల్లో సంస్కరణల అమలుపై కేంద్ర వాణిజ్య,వ్యాపారశాఖ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఆయా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించింది. 2015 నుంచి ఈ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.
సంస్కరణల ఆధారంగా రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా వాణిజ్యశాఖ విభజించింది. 2015లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంక్ రాగా, తెలంగాణకు 13వ ర్యాంక్ వచ్చింది. కాగా ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొదటి ర్యాంకును ప్రకటించింది. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం ఘననీయంగా మెరుగుపడింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







