భవనంలో అగ్ని ప్రమాదం: నివాసితులంతా సేఫ్
- October 31, 2016
మస్కట్: ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో, అందులో చిక్కుకపోయిన ఐదుగురు వ్యక్తులను రక్షించడానికి ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. వారి పోరాటం ఫలించి, ఆ ఐదుగురు వ్యక్తులూ రక్షింపబడ్డారు. భవనం పై అంతస్తులో ఉన్నవారిని రెస్క్యూ క్రేన్ సహాయంతో రక్షించారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ ఐదుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. ఐదో ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం సంభవించి, ఆ భవనమంతటా క్షణాల్లో మంటలు వ్యాపించాయని ఆయన వివరించారు. ఉదయం 8.45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా సంఘటనా స్థలంలో ఫైర్‌ఫైటర్స్, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







