బొప్పాయితో ఆరోగ్యం
- August 24, 2015
ఎక్కడైనా విరివిగా, చాలా తక్కువ ధరకే లభించే బొప్పాయిలోని ఔషధగుణాలు అమోఘం. పచ్చి బొప్పాయిలోని పెస్టిన్ అనే విటమిన్ మూత్ర వ్యాధుల్ని, గర్భ సంబంధిత వ్యాధుల్ని నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు గుజ్జులో హానికారక బాక్టీరియాను నియంత్రించే గుణం ఉంటుంది. ఒక్కోసారి యాంటి బయాటిక్స్ వాడిన తరువాత మన శరీరంలో చెడు చేసే బాక్టీరియానే కాకుండా మంచి చేసే బాక్టీరియా కూడా నశిస్తుంది. దాన్ని తిరిగి పొందేందుకు బొప్పాయి ఎంతో ఉపయోగకరం. బొప్పాయిలోని పీచు పదార్ధం గుండె జబ్బుల్ని, జీర్ణకోశ వ్యాధుల్నీ దరి చేయనీయకుండా చేస్తుంది. కొవ్వుని కూడా తగ్గిస్తుంది. బొప్పాయి గుజ్జును ఫేస్ ప్యాక్స్‌లో కూడా వాడతారు. దీన్ని వాడడం వల్ల ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. బొప్పాయిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మతిమరుపు రాదు. వయసుతో పాటు వచ్చే చర్మం ముడతలను కూడా నియంత్రించుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి కాన్సర్ కణాలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. స్థూలకాయులకు, మధుమేహం ఉన్న వారికి బొప్పాయి మంచి ఔషధం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







