చేమ దుంప స్పెషల్ కర్రీ
- August 24, 2015
కావలిసిన పదార్ధాలు
చేమదుంపలు - అరకిలో
మైదా - రెండు స్పూన్లు
పెరుగు - కప్పు
ఉప్పు - తగినంత
కారం - రెండు స్పూన్లు
బ్లాక్ సాల్ట్ - అరటీ స్పూను
కొత్తిమీర - ఒక కట్ట
నిమ్మకాయ - అర చెక్క
గరం మసాలా - ఒక స్పూను
లవంగాలు - రెండు
ఇంగువా - చిటికెడు
జీలకర్ర - అర స్పూను
అల్లం తురుము - కొద్దిగా
పచ్చిమిర్చి - రెండు
తయారీ విధానం
చేమ దుంపల్ని శుభ్రంగా కడిగి ఉడికించి పొట్టు తీసి గుండ్రని ముక్కల్లా కోసి, నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని బాగాగిలక్కొట్టి, దానిలో మైదా కలపి మరికొన్ని నీళ్లు పోసి బాగా గిలక్కొట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి దానిలో ఇంగువ, జీలకర్ర, లవంగాలు వేసి వేగాక పచ్చిమిర్చముక్కలు, అల్లం తురుము, పసుపు, కారం, వేసి కలపాలి. ఆ తర్వాత గిలక్కొట్టి పెట్టిన పెరుగు మిశ్రమం వేసి కలపాలి. తరువాత చేమదుంపల్ని, బ్లాక్‌సాల్ట్, గరం మసాలా వేసి తిప్పుతూ బాగా కలపాలి. చివరిగి కొత్తిమీర, నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







