జయహో కృష్ణ వేణీ!

- August 24, 2015 , by Maagulf
జయహో కృష్ణ వేణీ!

జయహో కృష్ణ వేణీ ! జయ జయజయహో కృష్ణ వేణీ!

జయహో కృష్ణ వేణీ ! జయ జయజయహో కృష్ణ వేణీ!

 

మహారాష్ట్రంబున మహాబలేశ్వరంబున   గోముఖవ్యాహరంబున ఉదయించే నీవు

మరాఠ నుండి మరలి  కర్ణాట   మీదుగా సాగి తెనుగు నేలను ముద్దాడినావు 

బంగారు తెలంగాణ కు సొబగులద్ది మహబూబ్ నగర్ ప్రజల దాహార్తి తీర్చేవు సప్త నదీ సంగమం సంగమేశ్వరం దాటి  అమరావతి నగర అపురూప అలంకారమయ్యేవు  !!జయహో !!

 

గిరిరాజసుతవై , గలగలా సాగే దివ్య ధాత్రి వై, కొండ కొనలను దాటి క్రొంగొత్తగా సాగేవు...

భూమి పుత్రునికి అభయమిచ్చి , మాగాణి నేలని  రతనాల నేల గా చేసేవు....

ఉత్తుంగ తరంగమై సాగి  శ్రీశైల మల్లిఖార్జునిని పాదాలు కడిగి , పుణ్య చరితవైనావు...

అమ్మల గన్న యమ్మ మాయమ్మ దుర్గమ్మ పాద మంజరిని  అలంకరించేవు.....    !!జయహో !!

 

పాడి పంటలు పసిడి కాంతులీను వచ్చేవు  మా వూరి  శ్రీ మహాలక్ష్మి జీవ నదిగా...  

శాస్త్ర పారంగతులు నీ దరి చేరి వేదాలు చదువంగా పులకించి వారిని పునీతులను చేసేవు

విహితమో  నిషిద్దమో  మా కర్మ ఫలం పుణ్య ఫలం గా మార్చి మాతృ ప్రేమతో మమ్మేలినావు

చెట్టు, పుట్టను నీ గర్భాన దాచుకుని సరిహద్దులు దాటి సాగి సాగి సాగరాన కలిసేవు .....  !!జయహో !!

 

రచన : సుబ్రహ్మణ్యశర్మ(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com