రెండు నెలలపాటు అల్ కస్సారాత్ రోడ్ మూసివేత
- November 01, 2016
పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్), రెండు శ్రీననెలలపాఓటు అల్ కస్సారత్ రోడ్‌ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బని హజెర్ (ఏరియా 51) ప్రాంతంలో ఇరువైపులా ఈ రోడ్డుని మూసివేస్తారు. దోహా నుంచి దుఖాన్ హైవే మీదుగా నార్త్ వైపు వెళ్ళే వాహనాల్ని అల్ రుఫా స్ట్రీట్ వైపు మళ్ళిస్తారు. నార్త్ నుంచి దోహాకి వెళ్ళే వాహనాల్ని అల్ రుఫా స్ట్రీట్‌కి మళ్ళిస్తారు. ట్రాఫిక్ మళ్ళింపులకు సంబంధించిన మ్యాప్‌ని కూడా ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. రోడ్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ - బని హజెర్ నార్త్ - రవ్‌దత్ ఎగ్‌దీమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనుల నిమిత్తం ఈ రోడ్ క్లోజర్‌ని అమల్లోకి తీసుకొచ్చారు. వాహనదారుల కోసం రోడ్ సైన్స్‌ని ఈ ప్రాంతంలో అషగల్ ఏర్పాటు చేస్తోంది. వాహన వేగాల్ని తగ్గించుకుని మళ్ళింపు మార్గాల్లో ప్రయాణించాల్సిందిగా అష్‌గల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







