దివాళీ క్రాకర్ తెచ్చిన చేటు
- November 01, 2016
దుబాయ్: దీపావళి సందర్భంగా దుబాయ్‌లో కొందరు ఇండియన్స్ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్న సమయంలో, 10వ తరగతి స్టూడెంట్ మొహమ్మద్ రిజ్వాన్, ఆ మార్గంలో వెళుతూ, పేలుతున్న క్రాకర్స్‌ని దగ్గరనుంచి చూసే ప్రయత్నం చేశాడు. అయితే అనుకోకుండా ఓ క్రాకర్ పేలి, రిజ్వాన్ కంటికి తీవ్ర గాయమైంది. వెంటనే, అతని సహచరులు గాయపడ్డ రిజ్వాన్‌ని ఆసుపత్రికి తరలించారు. సినిమాకి వెళ్ళి తిరిగొస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం రిజ్వాన్‌ని, దుబాయ్ హాస్పిటల్‌కి తరలించారు. ఎక్స్‌రే మరియు స్కాన్ నిర్వహఙంచిన తర్వాత, రెటీనా కార్నర్‌లో గాయమైందనీ, మూడు రోజులు కంటికి పూర్తి రెస్ట్ అవసమని వైద్యులు వెల్లడించారు. నెల రోజులపాటు కంట్లో ఎరుపుదనం ఉంటుందని, ఆ తర్వాత గాయం మానుతుందని వైద్యులు వివరించారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన రిజ్వాన్ తల్లి సోఫియా బేగమ్, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రిజ్వాన్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఇండియాలో ఉంటారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







