దుబాయ్‌లో ఈజిప్షియన్ ఫ్లాట్‌ను అమ్మేసిన భారతీయుడు!
- November 01, 2016
మాయమాటలతో ఓ ఈజిప్షియన్‌ను మోసగించి తనది కాని ఫ్లాట్‌ను విక్రయించిన భారతీయుడి కోసం దుబాయ్ పోలీసులు గాలిస్తున్నారు. ఫోర్జరీ, మోసం కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. వారి వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న నిందితుడు మరో వ్యక్తితో కలిసి తనది కాని ఓ ఫ్లాట్‌కు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. వాటిని ఓ ఈజిప్షియన్ వ్యాపారవేత్త(51)కు చూపించి ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టాడు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ జారీ చేసినట్టుగా ఉన్న ఆ డాక్యుమెంట్లను చూసిన వ్యాపారి అతడితో 9,25,650 దిర్హమ్స్(2,52,018 డాలర్లు)కు ఒప్పందం కుదుర్చుకుని చెల్లించాడు. డిసెంబరు 2014- జూన్ 2015 మధ్య ఈ ఘటన జరిగినట్టు బాధిత వ్యాపారి పోలీసులకు వివరించాడు.
నిందితుడిపై ఫోర్జరీ, మోసం కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







