రజని,చిరు షూటింగ్ అక్కడే..!
- November 01, 2016
తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల తర్వాత వెండితెరపై మెరవబోతున్న మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం 'ఖైదీ నెం.150' షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం 80 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లైమాక్స్ మినహా సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక పాటల మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అయితే చిరంజీవి సాంగ్స్ అంటే దాదాపు అన్ని హిట్ సాంగ్స్ ఉంటాయి కనుక పాటల చిత్రీకరణ కూడా చాలా రిచ్ గా తీయబోతున్నారట. అంతే కాదు దీపావళికి రిలీజైన పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని రెట్టింపుచేస్తున్నాయి. నిజంగా ఈ సినిమా బాస్ ఈజ్ బ్యాక్ లాంటిదే అంటున్నారు.
తాజాగా ఓ పాట చిత్రీకరణ కోసం ఇద్దరు స్టార్స్ ఒకే లొకేషన్ ఎంచుకోవడం యాధృచ్చికమే అయిన ఆ లోకేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుందట.
ప్రస్తుతం "టన్నెల్ ఆఫ్ లవ్" అనే ప్రదేశంలో ఒక పాట చిత్రీకరణ జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మద్య కాలంలోనే ఆ లొకేషన్ లో స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2 షూటింగ్ జరుపుకున్నారట.
ఉక్రెయిన్ లో ఒకానొక రైల్వే స్టేషన్ గా నిలిచిన ఈ ప్రదేశం అందాలకు కేరాఫ్ అడ్రాస్ గా నిలుస్తుందట. అయితే ఇలాంటి ప్రదేశంలో షూటింగ్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పనే..కానీ చిరంజీవి మాత్రం ఎక్కడా రాజీపడటం లేదట. అయితే ఖైదీ నంబర్ 150 రజినీ 'రోబో 2' కంటే ముందే విడుదల అవుతుంది కనుక ఆ అందాలు మనం ముందుగానే చూడచ్చు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







