పాకిస్తాన్‌లో వరుస పేలుళ్లు 12 మంది మృతి
- November 01, 2016
పాకిస్తాన్‌లో మంగళవారం నాడు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పన్నెండు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు ఆయిల్ ట్యాంకర్‌లో చిక్కుకు పోయినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన పాక్‌లోని దక్షిణ బెలూచిస్థాన్‌లో జరిగింది.
వరుస పేలుళ్లు జరిగాయి. కాలం చెల్లిన నౌకలను విచ్ఛిన్నం చేసే ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్ కారణంగా ఈ పేలుళ్లు సంభవించినట్టు గుర్తించారు. పేలుళ్లు జరిగిన సమయంలో గద్దాని షిప్ బ్రేకింగ్ యార్డులో వంద మంది కార్మికులు పని చేస్తున్నారు.
వీరిలో 30 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు. కొంతమంది నౌకలో చిక్కుకుని ఉంటారని, ప్రమాద సమయంలో మరికొందరు సముద్రంలో దూకి ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో అగ్నిమాపక యంత్రాలు, సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉండవచ్చునని భావిస్తున్నారు. నౌకలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఎనిమిది వరుస పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







