సునీల్‌తో ఎన్.శంకర్ కొత్త సినిమా
- November 01, 2016
సునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 చిత్రం ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో రూపొందనుంది. మలయాళ సినిమా `టు కంట్రీస్` చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం నవంబర్ 7 నుండి లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా.
దర్శక నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ - "మలయాళంలో టు కంట్రీస్ సినిమా చూడగానే బాగా నచ్చింది. ఈ సినిమా బాగా సునీల్ యాప్ట్ అవుతుందనిపించి, మలయాళంలో 55 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం కామెడి ఎంటర్‌టైన్మెంట్, సినిమాలో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి.
ఈ పాత్ర సునీల్‌గారు తప్ప ఎవరూ చేయలేరు. ఇది యూనివర్సల్ మూవీ. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మంచి స్క్రిప్ట్ కుదిరింది. శ్రీధర్ సీపాన మంచి సంభాషణలు కుదిర్చారు. మలయాళంలో `టు కంట్రీస్` చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్ తెలుగులో సంగీతాన్ని అందిస్తున్నారు.చాలా గ్యాప్ తర్వాత నా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నాకు, సునీల్‌కు మంచి బ్రేక్ నిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా నవంబర్ 7న లాంచనంగా ప్రారంభమై అదే రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. 70 శాతం సినిమా అమెరికాలో చిత్రీకరిస్తాం. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో జరిగే సినిమా. అలాగే ఓరిజినల్ ప్లేవర్ మిస్ కాకుండా స్క్రిప్ట్‌ను బెటర్ మెంట్ చేసి మన నెటివిటీకి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తాం" అన్నారు.
సునీల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: గోపీసుందర్, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







