దుబాయ్‌లో 45 శాతం షవరమా స్టాండ్స్ మూసివేత
- November 01, 2016
దుబాయ్: దుబాయ్‌లో 45 శాతం షవరామా స్టాండ్స్ మూసివేయబడనున్నాయి. షవరామా స్టాండ్స్ విషయంలో మునిసిపాలిటీ ఖచ్చితమైన గైడ్‌లైన్స్ రూపొందించి, వాటిని పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో కొన్ని స్టాండ్స్, మునిసిపాలిటీ గైడ్ లైన్స్ మేరకు మార్పులు చేర్పులు చేస్తుండగా, మరికొన్ని మూసివేతకు నిర్ణయం తీసుకున్నాయి. మొత్తం 572 మీడియా ఫుడ్ ఔట్‌లెట్స్‌కి షవరామా స్టాండ్స్ విషయమై ఆరు నెలల డెడ్‌లైన్‌ని విధించారు. వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమన్న కోణంలో కొత్త విధి విధానాల్ని మునిసిపాలిటీ జారీ చేసింది. అక్టోబర్ 31తో ఈ డెడ్‌లైన్ ముగిసింది. ఇప్పటివరకు కేవలం 318 స్టాండ్స్ మాత్రమే మార్పులు చేర్పులు చేసుకున్నాయి విధి విధానలకు అనుగుణంగా.113 స్టాండ్స్ పూర్తిగా ఆపివేయబడ్డాయని, 141 స్టాండ్స్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఏ స్టాండ్ ఉన్నా మూసివేయిస్తామని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ - ఫుడ్ ఇన్స్పెక్షన్ సెక్షన్ హెడ్ సుల్తాన్ అలి అల్ తాహెర్ చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







