పిల్లలో ఆస్తమాను కలుగచేసే కారణాలు
- November 03, 2016
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జలుబు భారినపడుతూనే ఉంటారు. చిన్న పిల్లల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. అయితే జలుబు ఏ కారణం వల్ల వచ్చిందనే అంశం చాలా ముఖ్యం. ఎందుకంటే అలర్జీ వల్ల వచ్చే జలుబును నిర్లక్ష్యం చేస్తే ఆస్తమాకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న పిల్లల్లో వచ్చే జలుబును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
చిన్నపిల్లల్లో జలుబు, అలర్జీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సైనస్, గొంతు, ఊపిరితిత్తుల అలర్జీలు రావడం పిల్లల్లో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల అలర్జీ సమస్యలు వస్తుంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. చలికాలంలో వాతావరణంలో కాలుష్యం ఎక్కువ సేపు ఉంటుంది. వాతావరణంలో పుప్పొడి రేణువులు ఉంటాయి. ఈ సీజన్‌లోనే ఉలన్ వస్తువులు ఎక్కువగా వాడతారు. పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు సహజంగానే వైరల్ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఈ సీజన్‌లో ఎక్కువగా వ్యాపిస్తాయి. ఈ కారణాల వల్ల చలికాలంలో అలర్జీ, ఆస్తమా సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతుంటాయి.
అలర్జీ, ఆస్తమాతో బాధపడుతున్న చిన్న పిల్లలందరికీ సరియైన వైద్యం లభించడం లేదు. చాలా మంది నెబ్యులైజర్ పెట్టించడం, యాంటీబయోటిక్ మందులు ఇప్పించడం చేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తగ్గకపోగా పెద్దవారయ్యాక కూడా ఆస్తమా సమస్య కొనసాగే అవకాశం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితాంతం ఆస్తమా వేధిస్తుంది. అలర్జీ సమస్యకు చిన్న వయసులోనే పూర్తి చికిత్స ఇప్పిస్తే ఆస్తమాగా మారే అవకాశం ఉండదు. నిర్లక్ష్యం చేస్తే ఉబ్బసంగా మారుతుందనడంలో సందేహంలేదంటున్నారు వైద్యులు.
అలర్జిక్ రైనైటిస్
ఇందులో కూడా గొంతులో అలర్జీ ఉంటుంది. పొడి దగ్గు ఉంటుంది. కళ్ల నుంచి నీరు, చెవుల నుంచి శబ్దాలు, లాలాజలం ఎక్కువ కారడం వంటి లక్షణాలుంటాయి. అలర్జిక్ రైనైటిస్ ఉండే వారికి ఆస్తమా చెకప్ అవసరమవుతుంది. ప్రాథమిక దశలో అలర్జిక్ రైనైటిస్‌కు చికిత్స తీసుకుంటే ఆస్తమా బారినపడకుండా కాపాడుకోవచ్చు.
ప్రధాన లక్షణాలు
సాధారణ జలుబు మూడు నుంచి నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు పది రోజులైనా తగ్గదు. ముక్కు నుంచి పసుపు పచ్చ లేదా ఆకుపచ్చ ద్రవం కారుతుంటే ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చినట్లుగా భావించాలి. అలా కాకుండా, ద్రవం తెల్లగా కారుతుంటే అది అలర్జీ వల్ల వచ్చిందని గుర్తించాలి. దీనికి తోడు అలర్జీ ఉన్న వారిలో తుమ్ములు ఎక్కువగా ఉంటాయి. గొంతులో సైతం అలర్జీ ఉంటుంది. పొడి దగ్గు ఉంటుంది. దగ్గు, జలుబు రెండూ ఉండే అలర్జీ ఉందని నిర్ధారించుకోవచ్చు. కళ్లలో నుంచి నీరు, చెవుల్లో నుంచి శబ్దాలు, నోట్లో లాలాజలం ఎక్కువ ఊరడం, ఆయాసం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
సైనస్ ఎక్స్‌రే తీయించడం వల్ల సైనసైటిస్ తీవ్రత తెలుసుకోవచ్చు. ఈ పరీక్షతో అలర్జిక్ రైనైటిస్ వ్యాధి గురించి తెలియదు. హైపర్‌సెన్సిటివ్ నోస్ అంటే దుమ్ము, ధూళికి ముక్కు సాధారణం కన్నా ఎక్కువ ప్రతిస్పందిస్తుంది. ఈ సమస్యను అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇది ఎక్స్‌రేలో నార్మల్‌గా కనిపిస్తుంది. అందుకే అలర్జిక్ ప్రొఫైల్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది.
ఇన్‌హేలర్ పాత్ర కీలకం
జలుబు చేయగానే పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మాత్రలు ఇప్పిస్తారు. దీనివల్ల జలుబు తాత్కాలికంగా తగ్గిపోతుంది. కొంతకాలం తరువాత మళ్లీ మొదలవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా లక్షణాలకు చికిత్స తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు వైద్యులు. లక్షణాలకు చికిత్స తీసుకుంటే వ్యాధి లోపల పెరిగిపోతుంది. అలా కాకుండా, వ్యాధికి చికిత్స తీసుకుంటే సమూలంగా తగ్గిపోతుంది. అలర్జిక్ రైనైటిస్‌ను తగ్గించడానికి ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక దశలో ఈ సమస్యకు మందులు వాడితే ఆస్తమా బారినపడకుండా కాపాడుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఆస్తమా లక్షణాలున్నప్పుడు ఇన్‌హేలర్ ఉపయోగించాలి. ఏడాది లోపు పిల్లలైతే నెబ్యులైజర్ వాడాలి. నెబ్యులైజర్‌లోనూ ఇన్‌హేలర్‌లో వాడే మందు ఒకటే. లక్షణాలను తగ్గించే ఇన్‌హేలర్‌తో పాటు జబ్బును తగ్గించే ఇన్‌హేలర్‌ను వాడాలి. దీన్ని ప్రివెంటివ్ ఇన్‌హేలర్ అంటారు. ఇన్‌హేలర్ వల్ల ఊపిరితిత్తులకు నేరుగా మందు పోతుంది. అయితే ఇన్‌హేలర్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పిల్లలు ఎత్తు పెరగరని, సరిగ్గా చదవలేరని కొంతమంది అనుకుంటుంటారు. కానీ అవన్నీ అపోహలే. ఇన్‌హేలర్ వాడటం మూలంగా ఎటువంటి దుష్ఫలితాలూ ఉండవు.
నివారణ
చల్లటి నీరు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీం వంటివి పిల్లలకు ఇవ్వకూడదు. పెర్‌ఫ్యూమ్స్, మస్కిటో రీపెల్లెంట్స్ ఇంట్లో ఉపయోగించకూడదు. ఉలెన్ దుస్తులు, కుక్కలు, పిల్లులు ఇంట్లో తిరగకుండా చూసుకోవాలి. కాటన్ దుస్తులు మాత్రమే వాడాలి. ఇంట్లో ఎవరూ స్మోకింగ్ చేయకూడదు. పరిశుభ్రత పాటించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమా బారినపడకుండా కాపాడుకోవచ్చు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









