పెరుగును ఈ పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి
- November 03, 2016
• పెరుగు
1. కొద్దిగా జీలకర్ర ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
2. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్య లు దూరమవుతాయి. ప్ర ధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
3. కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి.
4. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.
5. ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
6. పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
7. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
8. పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినాలి. దీని వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది.
9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
10. పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్స ర్ లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్ర మం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష న్లు వెంటనే తగ్గుతాయి.
--ముద్దినేని వెంకట శేషు శ్రీధర్(హైదరాబాద్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







