పర్సనల్ డేటా ప్రొటెక్షన్‌పై చట్టం
- November 03, 2016
ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, గురువారం లా నెంబర్ 13 - 2016ని విడుదల చేశారు. పర్సనల్ డేటా ప్రొటెక్షన్‌కి సంబంధించిన చట్టమిది. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైనప్పటినుంచీ ఈ చట్టం అమల్లోకి రానుంది. పర్సనల్ డేటా ప్రొటక్షన్‌కి సంబంధించి కొన్ని విధి విధానాల్ని ఖరారు చేస్తూ జూన్‌లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత సమాచారాన్ని ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా తెలుసుకోవడం, ప్రచారంలోకి తీసుకురావడం, ఇతర అవసరాలకు వినియోగించడం వంటివి ఈ చట్టం ప్రకారం నిషేధించబడ్తాయి. సంస్థలు వ్యక్తుల వ్యక్తిగత సమాచారంపై పూర్తిస్థాయి భద్రత కల్పించవలసి ఉంటుంది. తమ వద్దనున్న సమాచారాన్ని ఏ సంస్థ కూడా ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా ఎవరికీ అప్పగించరాదు. హ్యాకింగ్ వంటి చర్యలకు అతీతంగా డాటా బ్యాంక్‌కి రక్షణ కల్పించగలగాలి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ కొత్త చట్టం చెబుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







