ఖతార్ నుంచి రెమిటెన్స్‌ల పెరుగదల
- November 03, 2016
ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు సైతం ఖతార్ నుంచి రెమిటెన్స్‌లను తగ్గించలేకపోయాయనీ, ఈ విభాగంలో జిసిసి దేశాల్లో ఖతార్ పెరుగుదల నమోదు చేసిందని ఎక్స్‌ప్రెస్ మనీ సంస్థ ప్రకటించింది. గ్లోబల్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎక్స్‌ప్రెస్ మనీ, జిసిసిలో మిగతా దేశాల్లో రెమిటెన్స్‌లు తగ్గుముఖం పట్టగా, ఖతార్ మంత్ ఆన్ మంత్ గ్రోత్ 22 శాతం నమోదు చేసినట్లు పేర్కొంది. 2015తో పోల్చితే 2016లో పెరుగుదల స్థిరంగా కొనసాగుతుందని తాము వేసిన అంచనాలు నిజమైనట్లు ఎక్స్‌ప్రెస్ మనీ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీష్ గిఇయాన్ తెలిపారు. ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో జిసిసి దేశాల రెమిటెన్స్ తగ్గుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసినా, ఆ అంచనాలకు భిన్నంగా ఖతార్‌లో పరిస్థితులు ఉన్నాయి. 2022 ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో దేశం అనుసరిస్తున్న వ్యూహాత్మకమైన విధానాలతో దేశ ఆర్థిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







