అంగరంగ వైభవంగా యూఏఈ ఫ్లాగ్ డే
- November 03, 2016
దుబాయ్: నవంబర్ 3వ తేదీన యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా జాతీయ జెండాలు కనువిందు చేశాయి. ఎక్కడికక్కడ జాతీయ జెండాలు దర్శనమివ్వడంతో దేశభక్తి ఉప్పొంగింది యూఏఈ ప్రజల్లో. స్కూళ్ళు, ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, మినిస్ట్రీస్‌కి చెందిన కార్యాలయాల్లో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. దుబాయ్‌లోని జబీల్ పార్క్‌లో వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 20,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 120 దేశాలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సోషల్ మీడియాలోనూ వేలాదిమంది యూఏఈ జాతీయ పతాకాన్ని తమ ప్రొఫైల్స్‌లో పెట్టారు. దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే సెలబ్రేషన్స్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని షేక్ మొహమ్మద్ ఇచ్చిన పిలుపు మేరకు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చారిత్రక ఘట్టంగా నిర్వహించారు. 200 మందితో కలిసి వాకథాన్ కూడా నిర్వహించారు. అబుదాబీలోని అల్ జజిరా క్లబ్ నుంచి నేషనల్ థియేటర్ వరకు ఈ కార్యక్రమం జరిగింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ నాలెడ్జ్ డెవలప్‌మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







