'హల్ బ్రదర్' సీక్వెల్‌లో చైతూ
- November 05, 2016
'హలో బ్రదర్'... నాగార్జున, ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్‌లో రూపొంది సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. ఈచిత్రంలో నాగ్ సరసన రమ్యకృష్ణ, సౌందర్య నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఈ చిత్రం సీక్వెల్‌లో నాగార్జున తనయుడు నాగచైతన్య నటించే అవకాశాలున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలొచ్చాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి గ్రౌండ్‌వర్క్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఫుల్ మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో చైతూ సరసన తాప్సీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నట్టు సమాచారం. చైతూ ఈ ఇద్దరు కథానాయికలతో కలిసి నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. చైతూ ప్రస్తుతం 'సోగ్గాడే చిన్ని నాయన' ఫేం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తున్నారు.
ఈచిత్రం తర్వాత 'హల్ బ్రదర్' చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనుందట. 'ప్రేమమ్' సాధించిన విజయంతో సినిమాల విషయంలో చైతూ స్పీడ్ పెంచాడని పై విషయాలు చెప్పకనే చెబుతున్నాయి. అలాగే తాప్సీ ప్రస్తుతం 'నామ్ షబానా' చిత్రంలో నటిస్తోంది.
జాక్వెలిన్ గిన్నిస్ రికార్డ్ ప్రయత్నం..
'హల్ బ్రదర్' సీక్వెల్‌లో చైతూ సరసన నటించబోయే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నేడు (ఆదివారం) ఓ సరికొత్త రికార్డ్ కోసం ప్రయత్నిస్తోంది. మహిళల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా జాక్వెలిన్ ఓ అరుదైన ఫీట్ చేయనుంది. అనుకున్న రీతిలో ఈ ఫీట్ చేయగలిగితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో జాక్వెలిన్ పేరు నమోదైనట్టే. జాక్వెలిన్ ప్రస్తుతం 'ఎకార్డింగ్ టు మాథ్యూ' చిత్రంలో భిన్న పాత్ర పోషిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్‌కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









