అల్ షామాల్ రోడ్‌పై ఉమ్ సలాల్ మొహమ్మద్ ప్రారంభం
- November 06, 2016
దోహా: నార్త్ కారిడార్ విస్తరణ ప్రాజెక్టులో భాంగా పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, ఉమ్ సలాల్ మొహమ్మద్ ఇంటర్‌ఛేంజ్‌పై రాకపోకలకు అనుమతినిచ్చింది. ఐదు కిలోమీటర్ల మేర అల్ ఖోర్ లింక్ రోడ్ (అల్ షమాల్ రోడ్ నుంచి రస్ లఫాన్ రౌండెబౌట్ - అల్ ఖోర్ వద్ద) కూడా రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండు వైపులా మూడు లేన్లలో వాహనాలకు ఈ రోడ్ అందుబాటులోకి వచ్చింది. అల్ షమాల్ రోడ్‌కి సంబంధించిన ఇంటర్‌సెక్షన్‌తో తూర్పు పడమర వైపు ఉన్న అనేక ప్రాంతాలకు రాకపోకలు మరింత సులువుగా మారాయిప్పుడు. ఉమ్ సలాల్ మొహమ్మద్ ఇంటర్‌ఛేంజ్‌లో రెండు సెపరేట్ లెవల్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి డ్యూయల్ మెయిన్ బ్రిడ్స్, దీనికి రెండు లేన్లు రెండు వైపులా ఉంటాయి. మరో అదనపు లేన్, ర్యాంప్స్ కోసం, రెండు లైట్ సిగ్నల్స్‌తో ఏర్పాటు చేశారు. జంక్షన్‌లో నాలుగు ఆన్ అండ్ ఆఫ్ ర్యాంప్స్ కూడా ఉన్నాయి. నార్తనరన్ ర్యాంప్స్ తాజాగా & రపారంభమయ్యాయి. సౌత్ ర్యాంప్ ఇంకా నిర్మాణంలో ఉంది. అష్గల్ ప్రారంభించిన నార్త్ రోడ్ కారిడార్ విస్తరణ ప్రాజెక్టుల్లో ఇది మూడోది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







