63యేళ్ల వడిలోకి అడుగుపెట్టిన కమల్ కి జన్మదిన శుభాకాంక్షలు ,....
- November 07, 2016
నిజమే.. కమల్.. ఓ ప్రయోగ శాల. అక్కడ ఎన్నో ప్రయోగాలు జరుగుతుంటాయ్. నిత్యం ఏదో ఓ కొత్త పాత్రకై అన్వేషణ సాగుతుంటుంది. ఇప్పటికే ఎన్నో పాత్రల్లో చూశాం.. తరించాం. అయినా ఆ ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం ఆగదు. అది కొనసాగుతూనే ఉంది.
ఒకొక్కసారి కమల్ ప్రయోగం విఫలం కావొచ్చు. అతని ఆలోచనలు విమర్శల్ని ఎదుర్కోవచ్చు. కమల్ నిర్మాతలు ఆర్థికంగా నష్టాల పాలవ్వొచ్చు. కానీ కమల్ మాత్రం ఓ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఓ దర్శకుడిగా ఎప్పుడూ ఎవ్వరినీ నొప్పించలేదు. అందుకే.. కమల్ అంటే అప్పటికీ, ఇప్పటికీ అదే క్రేజ్.
సినిమా తప్పితే మరో ప్రపంచం తెలియని కమల్.. 60యేళ్లు దాటినా అదే ప్రయోగం కోసం ఆరాటం. ఇప్పటికే దశావతారాలని చూపించేశాడు.
ఏ నటుడు చేయని ప్రయోగాలు చేశాడు. నటుడు గానూ, దర్శకుడు గానూ, నిర్మాతగానూ.. కమల్ ప్రయోగాలు చేశాడు. కమల్ కొత్త ప్రయోగం 'శభాష్ నాయుడు'. ఈ చిత్రం మధ్యలో కమల్ గాయలయ్యాయి. ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న కమల్ శభాష్ నాయుడుని జెడ్ స్వీడుతో పూర్తి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే, ఈసారి కమల్ బర్త్ డే వేడుకలకి దూరంగా ఉండాలని అభిమానులకి సూచించాడు కమల్. తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు కమల్ అభిమానులకు తెలిపాడు. అయినా కమల్ అభిమానులు ఉండలేక. అభిమాన కథానాయకుడికి.. మనసులోనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు. 63యేళ్ల వడిలోకి అడుగుపెట్టిన కమల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







