సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్...
- November 07, 2016
'బాహుబలి' మూవీతో ప్రభాస్‌కి ఆలిండియా అంతా క్రేజ్ వచ్చింది. బాలీవుడ్లో కూడా ప్రభాస్‌తో డైరెక్ట్ మూవీ చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ మూవీతో ప్రభాస్ మార్కెట్ కూడా పెరిగింది. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా ప్రభాస్‌కి మర్కెట్ క్రియేట్ అయ్యింది. అందుకే.. 'బాహుబలి-2' తరువాత సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. 'మిర్చి' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది.ఈ మూవీ కోసం దుబాయ్‌లో ఓ ఛేజింగ్ ఫైట్ డిజైన్ చేసాడట డైరెక్టర్ సుజిత్.
అయితే.. ఆ ఒక్క ఛేజింగ్ ఫైట్‌కే దాదాపు 40 కోట్ల వరకూ ఖర్చుపెట్టడాని రెడీ అయ్యాడట ప్రభాస్. ఆ ఫైట్ కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌ను తీసుకొస్తారట. అయితే ఇదే హాలీవుడ్ టెక్నీషియన్ని రజనీకాంత్ 'రోబో-2' కోసం తీసుకురావాలనుకున్నాడట శంకర్.
కానీ.. అతని రెమ్యునరేషన్‌కు భయపడి వెనక్కుతగ్గాడట. కానీ.. ప్రభాస్ కోసం ఎంత ఖర్చు పెట్టి అయినా ఆ టెక్నీషియన్తోనే ఛేజింగ్ ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యారట ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







