3 లక్షల డి హెచ్ చోరీ చేసిన ఇరువురు డుబై విమానాశ్రయ కార్మికులు
- November 07, 2016
దుబాయ్ : ఫ్లై దుబాయ్ విమానంలో వచ్చిన ఒక భారతీయ వ్యక్తి తన జీవితంలో పొదుపు చేసుకొన్న మూడు కవర్లలో మిలియన్ డి హెచ్ మొత్తాన్ని దాచుకోగా, తన బ్యాగ్ నుండి ఒక కవరు తప్పిపోయినట్లుగా గుర్తించాడు. భారతదేశానికి చెందిన బాధితుడు (36) చోరీకి గురికాబడిన డి హెచ్ 286,522 విలువ చేసే కవరు మొత్తం డి హెచ్ 1,078,000 నుండి పోగొట్టుకోవాల్సి వచ్చింది. "నేను సౌదీ అరేబియా నుండి గత ఏడాది అక్టోబర్ 5 వ తేదీన ఇక్కడకు వచ్చి ఆ డబ్బు ఉన్న కవరు ని పోగొట్టుకున్నట్లు వివరించాడు. మూడు ఎన్విలప్లు కవర్లలోడబ్బు ఉండగా అందులో ఒక కవరులో ఉన్న కొంత డబ్బు మాయమైనట్లు తాను విమానాశ్రయంలో ఉండగానే గుర్తించినట్లు ఆ వ్యక్తి దుబాయ్ క్రిమినల్ కోర్ట్ లో చెప్పారు. అందులో ఒక కవరుని ఎవరో తెరిచి పాడు చేసినట్లు, అందులో డబ్బుని దొంగలించి తిరిగి దానిని అతికించే యత్నం చేసినట్లు గుర్తులు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. ఈ దొంగతనం చేసిన వారిలో బంగ్లాదేశీయుడు (28) మరియు ఒక ఘనానియన్ (29) వీరిద్దరూ విమానాశ్రయంలో సామాను నిర్వహించేవారు వారికి ఈ నేరానికి బాధ్యులుగా పోలీసులు అనుమానించారు. ఈ సంఘటన తర్వాత బంగ్లాదేశీ అక్టోబర్ 6 ప్రారంభ న ఒక విమాన టికెట్ తీసుకొని, దేశం వదిలి పారిపోయే యత్నం చేశాడు.పోలీసుల విచారణలో ఘనా దేశానికి చెందిన వ్యక్తి బాధితుడి బ్యాగ్ తెరిచిన బాంగ్లాదేశ్ వ్యక్తి ఒక కవరు బయటకు లాగి అది తన బట్టలు కింద దాచడం తాను చూసినట్లు చెప్పాడు. ఈ దొంగతనానికి పాల్పడిన ఈ ఇరువురిపై తీర్పు నవంబర్ 28 న వెలువడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







